విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆవరణములో గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద రాయలవారి 555వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. బలిజ సంఘం నాయకులు పెనుబోలు విజయభాస్కర్, అరిగెల భాస్కర్ ,డిష్ రాజు, గందోడు రాజా, ఆటో బాబు, తొండ మాల గుర్రప్ప, మిరియాల అంజి తదితరులు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలను, ఆయన ప్రజల కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, వారి అడుగుజాడలే మాకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. రాయల కాలంలో ప్రజా సంక్షేమం కోసం చెరువులు, బావులు, కుంటలు, కాలువలు త్రవ్వించారని తెలిపారు. తరతరాలుగా రాయలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
ఘనంగా శ్రీకృష్ణదేవరాయల జన్మదిన వేడుకలు
RELATED ARTICLES