Tuesday, May 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

డిగ్రీ ఐదవ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విడుదల చేసిన ఐదవ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ బిజడ్సి నందు గౌరీప్రియ 90 శాతము, మాధవి దేవి 90 శాతము, భావన 88 శాతము, జ్యోతి 88 శాతము, బీకాం నందు వంశీ 83 శాతము, షాహిద్ 83 శాతము, చందుమణి 80 శాతము, రజాక్ 80 శాతము, బీబీఎ నందు ఉమర్ ఫరూఖ్ 80 శాతము,షాహిద్ 78 శాతము మార్కులను సాధించారని వారు తెలిపారు. కళాశాల పాస్ పర్సంటేజ్ 96 శాతముగా నమోదు అయిందని ఇంతటి ప్రతిష్టాత్మక విజయాన్ని అందించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు