Friday, May 9, 2025
Homeజిల్లాలుఅనంతపురంఅమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి విద్యా సంస్థలు దిగ్బ్రాంతి

అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి విద్యా సంస్థలు దిగ్బ్రాంతి

విశాలాంధ్ర -అనంతపురం :అమరవీరుడు మురళి నాయక్ మృతికి శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల సీఈఓ పి. సుధాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. హెచ్. వనజమ్మ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వై నాగరాణిలు గురువారం దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
నిన్న రాత్రి పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండా శ్రీరాం నాయక్ కుమారుడు మురళి నాయక్ మన దేశం కోసం వీరమరణం పొందారన్నారు. ఎం మురళి నాయక్ 2019 -2022 విద్యాసంవత్సరాలలో బీకాం శ్రీ వాణి కళాశాల లో పూర్తి చేశాడని, ఈ మూడేళ్ల వ్యవధిలో యన్ సి సి కార్యక్రమాలలో చురుకుగా ఉంటూ, స్పోర్ట్స్ లో కూడా చాలా బహుమతులు గెల్చుకోవడం జరిగిందన్నారు. డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆర్మీలో స్థానాన్ని సంపాదించి అతని తల్లిదండ్రులతో పాటు కాలేజీ ఉపాధ్యాయులు తోటి విద్యార్థులను ఆశ్చర్య పరిచాడని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఘటనలో తెలుగు జవాన్ మురళి నాయక్ మరణించడం చాలా బాధాకరం అని ,ఇటువంటి యువ కిశోరం ను కోల్పోవటం భరత మాతకు తీరని లోటని అన్నారు. కళాశాల అతని మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అతని వీరమరణం పట్ల అధ్యాపకులు ఏ. సుధీర్ రెడ్డి,ఎన్ సి సి కోఆర్డినేటర్లు రామస్వామి నాయక్, నర్మదా, సి. ముత్యాలప్ప, కొండన్న, నర్సా నాయుడు, స్వర్ణలత, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు అతనికి అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు