ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మండల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల పాఠశాలలో హైస్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడే 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి పాఠశాలలో ఉదయము 8 గంటల నుండి 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు (విషయ ఆచార్యులు) తప్పక సమయసారనిని అమలు పరచాలని తెలిపారు. ఆయా రోజుల్లో సంబంధిత విషయాలు 15 నిమిషాలు ముందుగా పాఠశాలకు చేరుకోవాలని తెలిపారు. నిర్లక్ష్యం వహించకుండా పాఠశాల ఉత్తీర్ణత శాతానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరం అన్న విషయాన్ని హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు గుర్తించాలని వారు తెలిపారు. తప్పనిసరిగా సంబంధిత విషయాలు హాజరుకావాలని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నూరు రోజుల ప్రణాళిక విజయవంతం కావుటకు ప్రధాన చార్యులతో పాటు ప్రతి ఉపాధ్యాయులు కూడా బాధ్యతతో ఈ విధులను నిర్వర్తించాలని తెలిపారు. పదవ తరగతి అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత వచ్చేలా మరింత కృషి చేయాలని వారు తెలిపారు. ఏ పాఠశాల నుండి అయినా సరే ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పమని వారు హెచ్చరించారు. ఆయా పాఠశాల హెడ్మాస్టర్లు ఆదనపు తరగతుల విషయంలో ముందుగానే విషయ ఆచార్యులను టైం టేబుల్ మాదిరిగా వేసి, సమన్వయ లోపం లేకుండా తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా బాలికలు ఉన్న పాఠశాలలో హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ నూరు రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పాఠశాల నుండి ఇంటికి చేరేంతవరకు తగిన శ్రద్ధను కనపరచాలని తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు గాని, హెడ్మాస్టర్లు గాని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
ప్రత్యేక తరగతులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు సమయపాలన పాటించాలి
- Advertisement -
RELATED ARTICLES


