జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఫిరోజా బేగం
విశాలాంధ్ర ధర్మవరం:; మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రావులచెరువు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫిరోజా బేగం, డిఐఓ దగ్గర శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల పలు రికార్డులను వారు తనిఖీ చేశారు. అలాగే వేసవికాలంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి? తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి ప్రజలకు తెలపాలని, ముఖ్యంగా వడదెబ్బ గూర్చి కూడా తెలియజేయాలని వారు తెలిపారు. ల్యాబ్ రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి ఇమ్యునేషన్, ఎన్ సి డి, ఆర్ సి హెచ్ ప్రోఫార్మెన్స్, పి ఎం జె ఏ వై కార్డ్స్ డెలివరీస్ గూర్చి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో నాగేంద్ర నాయక్, వైద్యులు డాక్టర్. దిలీప్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.
వడదెబ్బపై అవగాహన
RELATED ARTICLES