Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. అనంతరం సిఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తులను మీకు ఎదురుపడితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని అక్కడి ప్రయాణికులకు ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించిన, నేరం చేసిన కఠినంగా శిక్షలు తప్పవని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రజల మీద, మా మీద ఉందని వారు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినచో డైల్ 100 తో పాటు సెల్ నెంబర్ 6305800429 కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు