Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు

నేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు

- Advertisement -

మానవతా చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో అతి కొద్ది కాలంలోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల వద్ద, అధికారుల వద్ద, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వద్ద మంచి గుర్తింపును పొందడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గలవారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను కూడా గత కొన్ని నెలలుగా సేవా దృక్పథంతో పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణంలోని శాంతినగర్ లో నివాసముంటున్న మేడా సుధాకర్ తండ్రి కీర్తిశేషులు మేడా శ్రీరాములు మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతో నేత్రదానంపై మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అవగాహన కల్పించడంతో, వారు అంగీకరించి నేత్రదానమును నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారి తరఫున టెక్నీషియన్ రాఘవేంద్ర కుటుంబ వద్దకు చేరుకొని మృతి చెందిన మేడా శ్రీరాములు నేత్రాలను తీసుకున్నారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఆ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ఉపాధ్యక్షులు మంజునాథ్, సభ్యులు రవికుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు