విశాలాంధ్ర-రాజాం : రాజాం మున్సిపాలిటీ పరిధి లోగల పలు వార్డులలో మున్సిపల్ కమిషనర్ జె. రామప్పల నాయుడు ఉదయం 6 గంటలకే ప్రధాన రహదారిపై మరియు పలు వీధులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ పనులు పై, పలు కాలువలలో పెరిగిపోయిన చెత్తాచెదారంలను వెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ చేగొండి హరిప్రసాద్ కు ఆదేశించారు. వీరి వెంట సానిటరీ సూపర్వైజర్ నాయుడు, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.