Monday, May 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు సద్వినియోగం చేసుకోవాలి

గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు సద్వినియోగం చేసుకోవాలి

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా నీతి కథలను గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగుప్రామాణికంగా తీసుకుంటూ, నీతి కథలు వల్ల మంచి విజ్ఞానం కూడా పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు తెలుగు రాయట, చదువుట అలవాటు చేసుకున్నప్పుడు సులభతరం అవుతుందని తెలిపారు. అంతేకాకుండా చదువుతోపాటు క్రీడలు ఆటలు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు