Homeఆంధ్రప్రదేశ్ఓపెన్ చదరంగం పోటీలను సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ బి వి సుబ్బారావు

ఓపెన్ చదరంగం పోటీలను సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ బి వి సుబ్బారావు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నవంబర్ 8వ 9వ తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఓపెన్ చదరంగం పోటీలను చదరంగం క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని టోర్నమెంట్ ఆర్గనైజర్ డైరెక్టర్ ఈశ్వరప్ప, టోర్నమెంట్ హానరబుల్ అధ్యక్షులు డాక్టర్ బి.వి సుబ్బారావు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షులు చాంద్ బాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ చెస్ పోటీలలో 60 వేల రూపాయలు నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. ప్రవేశ రుసుము 600 రూపాయలు చెల్లించాలని తెలిపారు. యువర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం ,వ్యవస్థాపక అధ్యక్షులు పోలా ప్రభాకర్, కౌన్సిలర్ కేతా లోకేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు