Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీనియర్ సిటిజెన్లకు రెవెన్యూ కోర్టులో తప్పక న్యాయం లభిస్తుంది.. ఆర్డీవో మహేష్

సీనియర్ సిటిజెన్లకు రెవెన్యూ కోర్టులో తప్పక న్యాయం లభిస్తుంది.. ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; సీనియర్ సిటిజనులకు రెవెన్యూ కోర్టులో తప్పక న్యాయం చేకూరుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లోని కోటకు చెందిన గుంజర లక్ష్మమ్మ కూతురైన లక్ష్మీదేవికి దానవిక్రయం చేసి, బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నో సమస్యలను, మానసిక బాధలను అనుభవించిన తల్లి గుంజర లక్ష్మమ్మ కు చివరకు ఆర్డిఓ మహేష్ న్యాయం చేకూర్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ గుంజల లక్ష్మమ్మ (భర్త లేట్ గుంజర నారాయణస్వామి) అనే తల్లి కు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు కలడని తెలిపారు. ఇందులో రెండవ కుమార్తె అయిన లక్ష్మీదేవికి దాన విక్రయం కింద సర్వే నెంబర్ 596-1, విస్తీర్ణం 59.50 సెంట్ల స్థలాన్ని ఇచ్చి, తన బాగోగులు చూడాలని తెలిపింది. అందుకు అంగీకరించిన లక్ష్మీదేవి కొన్ని రోజులు బాగానే చూసుకుందని, అనంతరం తల్లికి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వలన, ఆ బాధలు తాళలేక 5/2/2025 వ తేదీన ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని పలుమార్లు కుటుంబ సభ్యులతో విచారణ జరపడం జరిగిందని, అనంతరం తల్లిని ఇబ్బందులకు గురి చేసింది వాస్తవం కావడంతో శుక్రవారం నాడు (24/10/2025) రెవెన్యూ కోర్టు ద్వారా కుమార్తె లక్ష్మీదేవికి ఇచ్చిన దాన విక్రయం స్థలమును తిరిగి తల్లి గుంజల లక్ష్మమ్మకు అప్పగిస్తూ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు గుంజర లక్ష్మమ్మ, మనవడు మహేష్ మాట్లాడుతూ ఇటువంటి న్యాయం మాకు జరగడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో మాలాంటి వారికి కూడా ఇలాంటి న్యాయం జరగాలని వారు తెలిపారు. రెవెన్యూ కోర్టులో ఇంత త్వరగా మాకు న్యాయం జరగడం పట్ల ఆర్డిఓ మహేష్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు