Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఓటు నమోదు లో ఎటువంటి జాప్యం జరగరాదు.. ఆర్డీవో మహేష్

ఓటు నమోదు లో ఎటువంటి జాప్యం జరగరాదు.. ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఓటు నమోదు ప్రక్రియలో ఎటువంటి జాప్యం ధర్మవరం నియోజకవర్గంలో జరగరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆర్డిఓ కార్యాలయంలో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ అనంతరం నియోజకవర్గంలోని ఓటరు జాబితా పై పలు విషయాలను వారు ప్రస్తావిస్తూ, రాజకీయ పార్టీ ప్రతినిధుల సూచనలు కూడా స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. అక్టోబర్ 22వ తేదీ నాటికి నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలలో మొత్తం పురుషులు 1,22,582 మంది, స్త్రీలు 1,25,053, ఇతరులు 22 మంది కలిసి మొత్తం 2,47,657 ఓటర్లు ఉన్నారని తెలిపా రు. అదేవిధంగా ఓటర్ జాబితా పరిశీలనలో బిఎల్ఏలు, బి ఎల్ వో లు తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీల సహకారంతోనే విచారణ, పరిశీలన తప్పక చేయాలని తెలిపారు. బి ఎల్ ఏ జాబితా ఇంకను కొన్ని రాజకీయ పార్టీలు అందించలేదని, వెనివెంటనే అందించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో సురేష్ బాబు, ఇడిటి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ సహాయకులు రాఘవరెడ్డి, సిబ్బంది రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు