Thursday, May 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్బిఐ వ్యక్తిగత ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోండి

ఎస్బిఐ వ్యక్తిగత ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోండి

ఎస్బిఐ ప్రధాన శాఖ మేనేజర్ పి. సందీప్
విశాలాంద్ర – ధర్మవరం : ఎస్బిఐ బ్యాంకు వారి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ప్రధాన శాఖ ఎస్బిఐ మేనేజర్ పి. సందీప్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సంవత్సరానికి కేవలం 2000 రూపాయలు (రోజుకు కేవలం 6 రూపాయలతో) పాలసీకి డబ్బు కట్టాలని తెలిపారు. దీనివల్ల 40 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల గాని,కరెంటు షాక్ వల్ల కానీ ,వరదలు వల్ల కానీ, భూకంపం వల్ల కానీ, పాము కాటు వల్ల కానీ, తేలు కాటు వల్ల గాని ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పాలసీదారునికి ప్రమాదం సంభవిస్తే నామినీకి 40 లక్షల రూపాయలు బీమా నగదు పొందగలిగే అవకాశం ఉందని తెలిపారు. ఎస్బిఐ ప్రజల సేవలో నిరంతరం ఉంటూ సేవలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఇటువంటి పాలసీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు