Homeజిల్లాలుశ్రీ సత్యసాయి120వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి

120వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణములో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 120 ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరాలు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, నిష్ణాతులైన వైద్యులచే వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నేటి ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు చందా గోవిందప్ప జ్ఞాపకార్థం ధర్మపత్ని చెందా లక్ష్మీ దేవమ్మ కుమారుడు చందా చంద్ర కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు