విశాలాంధ్ర _అనకాపల్లి: కళాతపశ్వి కె. విశ్వనాథం మెమోరియల్ అవార్డు_2026 కి అల్లాడ బాల సౌజన్య కుమారి ని ఎంపిక చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మోహిత్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పవిత్ర పుణ్యక్షేత్రం ర్యాలి చెందిన అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే అవార్డు ఏడాది బాల సౌజన్య కుమారికి ఇస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన కె విశ్వనాథ్ జన్మదిన సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం ర్యాలి గ్రామంలో ని అన్నపూర్ణ డే కేర్ హోమ్ లో అవార్డును ప్రధానం చేయునట్లు కె విశ్వనాథ్ మెమోరియల్ అవార్డ్స్ కమిటీ తెలిపింది.
కళాతపస్వి పురస్కారానికి అల్లాడ బాల సౌజన్య కుమారి ఎంపిక
- Advertisement -


