Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

ఐఓఎల్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహించబడే ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ ఆవరణములో వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మండూరి రామయ్య కీర్తిశేషులు మండూరి నాగరాజు జాపకార్థం కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ, నేత్ర జ్యోతి గంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి వచ్చు కంటి రోగులు ఆధార్ కార్డ్ ,ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్లు ఫోన్ నెంబర్ తో పాటు చిరునామా వెంట తీసుకొని రావలెనని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ధర్మవరం పరిసర ప్రాంతాల ప్రజలకు కొన్ని వేల మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో రాధాకృష్ణ, డాక్టర్ సుబ్బారావు, చాంద్ భాషా, పోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు