విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరంలో నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ కొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండలి లో శిబిర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిర దాతలుగా కీర్తిశేషులు పిన్ను సూర్యనారాయణ జ్ఞాపకార్థం భార్య వసుంధరమ్మ , కుమారులు సురేష్ బాబు,సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటి నిపుణులు సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డులలో ఏదైనా రెండు జిరాక్స్ కాపీలు, మూడు ఫోటోలు ఫోన్ నెంబర్ తో తప్పక రావాల్సి ఉంటుందని తెలిపారు. బీపీ, షుగర్ అధికంగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గిన తర్వాత రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్,శ్రీనివాసరెడ్డి, రత్నశేఖర్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శివయ్య, దాతలు పిన్ను సురేష్ బాబు, పెరుమాళ్లదాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. రోటరీ క్లబ్
RELATED ARTICLES