Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోండి. ఆర్డిఓ మహేష్

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను సద్వినియోగం చేసుకోండి. ఆర్డిఓ మహేష్

విశాలాంధ్ర ధర్మవరం : ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ, 23వ, 24వ తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిఎల్ఓ ల ద్వారా పోలింగ్ బూతులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూతన ఓటు, చేర్పులు మార్పులు తదితర విషయాలను పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫారం-6 లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటును నమోదు చేసుకొనుట, ఫారం-7 లో తొలగింపులు, మృతి, డబుల్ ఎంట్రీ, ఇల్లు మార్పులు, వివాహమై వెళ్ళిన వారు, అదేవిధంగా ఫారం-8 చేర్పులు మార్పులు లను బి ఎల్ ఓ ల దగ్గరకు వెళ్లి మార్పు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ ప్రత్యేక ఓటర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు