- Advertisement -
విశాలాంధ – తాళ్లపూడి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భం గా ప్రభుత్వం ప్రకటించిన అవార్డు ల లో భాగంగా తాళ్లపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న టి.రామకృష్ణ బెస్ట్ పోలీస్ అవార్డు అందుకున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన వేడుకలలో కలెక్టర్ ప్రశాంతి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా జిల్లా ఎస్పీ సమక్షం లో ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని విధి నిర్వహణలో మరింత భాద్యత తో పని చేస్తానని అన్నారు.


