Homeఆంధ్రప్రదేశ్చదరంగం పోటీలకు తపస్విరెడ్డి

చదరంగం పోటీలకు తపస్విరెడ్డి

- Advertisement -

జిల్లాస్థాయి చదరంగం పోటీలకు తపస్విరెడ్డి ఎంపిక

విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు నారాయణ పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి కె.యస్.పి తపస్విరెడ్డి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారునిర్వహించిన  69వ స్కూల్ గేమ్స్  లో కొవ్వూరు డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి చదరంగం పోటీలకు ఎంపికయ్యాడు. నిడదవోలు మండలం పురుషోత్తపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజనల్ స్థాయి అండర్ 14 చదరంగం పోటీలు బాలుర విభాగంలో  తపస్వి రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలలో తొమ్మిది మండలాలకు చెందిన విద్యార్థులు పోటీ పడగా తపస్వి రెడ్డి ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లా చదరంగం పోటీలకు ఎంపికయ్యాడు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల లో జరిగిన 22 వ నేషనల్ వి.ఐ.పి చాలెంజర్ కప్ 2025 బ్లాక్ బెల్ట్ ఓపెన్ క్యాటగిరిలో కటా మరియు కుమిటే రెండు విభాగాలలోను ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాడు.  ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సేకో షాటో కాన్ అడ్వాన్స్డ్ కరాటే డు ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్2025 బ్లాక్ బెల్ట్ కేటగిరిలో కటా విభాగంలో రజత పతకా న్ని తపస్వి రెడ్డి  కైవసం చేసుకున్నాడు. విద్య తో పోటు పలు క్రీడల్లో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటున్న తపస్వీ రెడ్డిని పుర ప్రముఖులు, యస్.జి.యఫ్ నిర్వాహకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. తోటి విద్యార్థులు అభినందించారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు