Homeజిల్లాలుకర్నూలుఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప, ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథరాముడు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి మాట్లాడుతూ రాఘవేంద్రరెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలన్నారు. ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ జెండా ఎగుర వేసి రాఘవేంద్రరెడ్డికి పుట్టిన రోజు కానుకగా అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ కార్యదర్శి మునెప్ప, హెచ్ మురవణి గ్రామ అధ్యక్షులు సొంటెన్న, జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, నాయకులు తాయన్న, సంజీవయ్య, రాఘవరెడ్డి, మధు, రంగన్న, శాంతప్ప, కేశవ, నరసప్ప, చెన్నకేశవ, మునిస్వామి, అరవ రామాంజనేయులు, బిజెపి మండల అధ్యక్షులు పురుషోత్తం గౌడ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు