Homeజిల్లాలుఅనంతపురం26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 26వ తేదీ గురువారం ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మరియు అర్చకులు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ
వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు, పుణ్యాహవచనం, ప్రాణ ప్రతిష్ట వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ స్థానిక షిరిడి సాయిబాబా ఆలయం నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26వ తేదీ ఉదయం 3-45 గంటల నుండి 5-35 గంటల లోపు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం అనంతరం మహామంగళహారతి, స్వామి వారి కళ్యాణం ఉత్సవం అన్నదానం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పవిత్ర కార్యక్రమం ద్వారా గ్రామానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని, భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు అందరూ సహకరించి, ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

దాతలు సహకరించాలి

నూతనంగా నిర్మితమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణమునందు గోపురం నిర్మాణం ధ్వజస్తంభం ప్రతిష్ట, మరియు ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేయాల్సి ఉందని కావున భక్తులు ధన, వస్తురూపేనా సహాయ సహకారాలు అందించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు