Homeఆంధ్రప్రదేశ్పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు!

పదవి కోసం హడావిడిగా పెళ్లి.. చివరకు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లో ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్లకు మూడు రోజులే గడువు ఉండటంతో పార్టీలు కూడా వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పొలిటికల్ పెళ్లి హాట్‌టాపిక్ అయ్యింది.. 

సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి BC మహిళకు కేటాయించడంతో TDP నాయకుడు తన ప్రేయసి మంజీరను గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలోకి దిగాలనే ఉద్దేశంతో బంధువులనూ పిలవకుండా అత్యవసర వివాహం చేసుకున్నారు. కాగా, కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు ఖరారైంది. పాపం ముహూర్తాలు లేకపోయినా పదవి కోసం హడావిడిగా బంధువుల్ని కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్న యువనేత హర్షవర్ధన్‌కు నిరాశ తప్పలేదు.

సాలూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం 32 వార్డులు ఉండగా.. చైర్‌పర్సన్‌ పదవికి ఈసారి ప్రత్యక్ష ఎన్నిక జరగనున్నాయి. హర్షవర్ధన్‌ 2019లో టీడీపీ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. హర్ష మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విధేయుడిగా పేరుంది.. బలమైన సామాజిక వర్గం అండ, రాజకీయ అనుభవం కూడా ఉంది. ఆయన తండ్రి వైకుంఠపు పంచముఖి కూడా గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. అందుకే మున్సిపల్ ఛైర్మన్ పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. హర్షవర్ధన్, మంజీరాలు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు మరో 6 నెలల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే సాలూరు మున్సిపాలిటీ ఛైర్మన్ జనసేన పార్టీకి కేటాయించడంతో హర్షవర్ధన్ తీవ్ర నిరాశాలో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు