విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కడపలో జరుగుతున్న మహానాడుకు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండల నాయకులు, కార్యకర్తలు బుధవారం తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్, మునెప్ప, నర్సిరెడ్డి, సంజీవయ్య, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్లు, బస్సులలో బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.