Homeజిల్లాలుతూర్పు గోదావరిప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించిన గురువులు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించిన గురువులు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి, 500 మార్కులు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, ఎస్ఎంసి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని హాజరయ్యారు. వి వాసంతి 563 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, సిహెచ్ గౌతమి 557, జె వైశాలి 553 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. తేజాశ్వంత్ 550, సత్యపావని 547, ఎన్వి సత్యసాయి 544, దీపిక 539, ఆదిత్య వర్ధన్ 530, మేఘన 527, రాజేశ్వరి 524, గణేష్ 520, నాగ శ్రీలక్ష్మి 518, శ్రీలక్ష్మి 517, షిరీన్ 505, శ్రీరామ్ 501 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి సత్యనారాయణ మాట్లాడుతూ 149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 124 మంది ఉత్తీర్ణత సాధించారని, మిగిలిన వారికి అదనపు క్లాసులు నిర్వహించి రానున్న పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని మండల టిడిపి అధ్యక్షులు నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ తోరాటి శ్రీను, ఉపాధ్యాయులు రమేష్ బాబు, బి సువర్ణవేణి, శరత్ బాబు, డేవిడ్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు