Homeజిల్లాలుతూర్పు గోదావరినర్సరీ రైతులకు తక్కువ ధరలకే మొక్కల కవర్లు

నర్సరీ రైతులకు తక్కువ ధరలకే మొక్కల కవర్లు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ఇటీవల మార్కెట్లో మొక్కల కవర్లు ధరలను ఆకస్మికంగా పెంచడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన తూర్పు గోదావరి జిల్లా, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు రైతులకు అండగా నిలిచారు. 25 కేజీల మొక్కల కవర్ల బస్తాలను కేవలం రూ.3800కే రైతులకు అందజేసి రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. ఇదే విధంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 28, 2026 నాటికి పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు పోలీ బ్యాగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ధరలు పెరగకముందే అవసరమైన మొక్కల కవర్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.
కవర్ల బస్తాల బుకింగ్ కోసం ఆసక్తి గల రైతులు అసోసియేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు