Monday, May 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి…

ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి…

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు ముత్యాలప్ప.
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ అపరిష్కృతసమస్యలు పరిష్కరించాలని ధర్మవరం పాత తాలూకా కేంద్రంలో జోనల్ బాధ్యులు బలరాముడు అధ్యక్షతన ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు బికే ముత్యాలప్ప మాట్లాడుతూ ఉపాధ్యాయ అపరిస్కృత సమస్యలు అయిన పిఆర్సి కమిటీని వెంటనే వేయాలని 30 శాతం ఐ ర్ ప్రకటించాలని సిపిఎస్ ను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న డి ఎ లను మంజూరు చేయాలని తెలిపారు. ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 117 రద్దు చేయాలని, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుంటే ఆ జీవో ను రద్దు చేయకుండా గతంలో ఆరు రకాల ఉన్న పాఠశాలను ఇప్పుడు మరీ 9 రకాల పాఠశాలలుగా మారుస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రయోగశాలలుగా మారుస్తూ అనేక అసంబద్ధ విధానాలతో మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలనే మూసివేసే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోరకం పాఠశాలలో ఒకరకమైన విద్యార్థి, ఉపాధ్యాయనిష్పత్తిని పాటిస్తూ అందరికీ సమాన విద్య హక్కును ప్రభుత్వం కాలరాస్తున్నది అని మండి పడ్డారు. మున్సిపల్ పాఠశాలలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయని అప్గ్రేడ్ అయిన పాఠశాలలకు హెచ్ఎం, ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు జోనల్ బాధ్యులు బలరాముడు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ అనేక ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరి పాటిస్తున్నదని, అనేక అసంబద్ధ విధానాలతో ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీలను జరపాలని ప్రయత్నం చేస్తుందని, బదిలీలలోనీ అసంబద్ధ విధానాలను తొలగించి అందరికీ సమన్యాయం చేసే విధంగా బదిలీలు జరపాలని తెలిపారు.
ఆ తర్వాత వివిధ డిమాండ్లతో కూడిన మెమొండమును స్థానిక తహసిల్దార్ కు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ పరిధిలోని వివిధ మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య, శివానంద, శ్రీనివాసులు, జగదీష్, బాలయ్య, నరసింహులు, హరిప్రసాద్, గోపాల్, శంకర్ నారాయణ, వాసు, కుమార్, రవికుమార్, హేమంత్, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి వెంకటేష్ నాగప్ప, బయన్న, దుర్గాప్రసాద్, సుదర్శన, ఓబులేష్ , 100 పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు