అనంత జిల్లా సిపిఐ కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : సీనియర్ జర్నలిస్ట్ తేజ ప్రసాద్ మృదుస్వభావి అని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో తేజ ప్రసాద్ పార్థివ దేహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీ. జాఫర్ మాట్లాడుతూ… తేజ ప్రసాద్ కొన్ని సంవత్సరాలగా సుపరిచితుడు అని ఎప్పుడు కలిసినా కూడా పలకరించేవాడు అన్నారు. తను సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తూ జూనియర్లకు వార్తలు ఎలా రాయాలో తెలియజేసేవాడు అన్నారు. ఆయన పార్టీ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడం వలన మెడికల్ విద్యార్థులకు దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆయన పార్టీ దేహాన్ని పరిశోధనలకు వాడుకోవడం జరుగుతుందన్నారు. సమాజ సేవ కోసం పనిచేస్తూ తన మరణానంతరం కూడా ప్రజలకు ఉపయోగపడేలా పార్థివ దేహాన్ని మెడికల్ విద్యార్థులకు అప్పగించడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.