Saturday, January 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంతేజ ప్రసాద్ మరణం జర్నలిస్టులోకానికి తీరని లోటు

తేజ ప్రసాద్ మరణం జర్నలిస్టులోకానికి తీరని లోటు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : సీనియర్ జర్నలిస్ట్ తేజ ప్రసాద్ దాదాపు 30 సంవత్సరాలు పైగా సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను వెలుగులోకి తీసుకుని వచ్చినటువంటి తేజ ప్రసాద్ ఆకస్మిక మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం తేజ ప్రసాద్ పార్టీవదేహాన్ని మెడికల్ విద్యార్థులకు పరిశోధన కోసం అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ తేజ ప్రసాద్ పార్టీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ… సమాజం కోసం పనిచేస్తూ చివరి క్షణంలో తన పార్టీవ దేహాన్ని మెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థులకు పరిశోధనల కోసం అప్పగించడం అభినందనీయమన్నారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఆయనతో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు