తాజా అధ్యయనంలో వెల్లడి
దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మహిళా సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని తేల్చింది. ఈ మేరకు ప్రోగ్రమాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (పీఎంపీఎస్ఈ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య 9,95,499 గా ఉందని అంచనా.ఈ జాబితాలో 15.4 శాతం సెక్స్ వర్కర్లతో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (12.0%), మూడో స్థానంలో మహారాష్ట్ర (9.6%), నాలుగో స్థానంలో ఢిల్లీ (8.9%), టాప్ ఫైవ్ లో తెలంగాణ (7.6%) ఉన్నాయి. దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 53% మంది ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పీఎంపీఎస్ఈ నివేదిక పేర్కొంది. ఇక, రెడ్ లైట్ హాట్స్పాట్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సాంద్రత పరంగా ఒక్కో హాట్‌స్పాట్‌లో సగటున 38 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని తెలిపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని పేర్కొంది.