విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులో చెడిపోయిన చేతి పంపులకు సోమవారం మెకానిక్ పౌలయ్య మరమ్మత్తులు చేపట్టారు. చేతి పంపు చెడిపోవడంతో కాలనీ వాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెకానిక్ పౌలయ్య చేతి పంపులోని పైపులు తీసి కొత్త పరికరాలను వేసి మరమ్మతులు చేశారు. చేతి పంపుల ద్వారా నీళ్లు రావడంతో చుట్టూ పక్కల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు.