Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జరిగిన శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు..

ఘనంగా జరిగిన శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు..

- Advertisement -

బలిజ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బలిజసంఘంనాయకులుశ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బలిజ కళ్యాణమండపం వద్ద నుండి తెేరు బజార్, అంజుమాన్ సర్కిల్, పిఆర్టి స్టేట్, కళా జ్యోతి సర్కిల్, కాలేజ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బలిజ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు కదిరింటి శ్రీరాములు మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన దార్శినికుడు శ్రీకృష్ణదేవరాయులు అని కొనియాడారు. ఆయన పాలన గతించి వందల ఏళ్లు గడుస్తున్నా ఆయన సాధించిన అభివృద్ధి, పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికీ కొనసాగుతుండడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరింటి శ్రీరాములు, మాసపల్లి సాయికుమార్, పసుపులేటి కళ్యాణ్, సంకు అఖిల్, ఫణి కుమార్, సంద్రా రమేష్, అరవింద్, గుండ్లపల్లి ధనుంజయ, పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, దాసరి సురేష్, శ్యామ్, మహేష్, లోనుకోట బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు