Friday, March 6, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 22న నిర్వహించే చేనేత గర్జనను విజయవంతం చేయండి

ఈనెల 22న నిర్వహించే చేనేత గర్జనను విజయవంతం చేయండి

- Advertisement -

చేనేత కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మిక సంఘం, సహకార సంఘాలు, వస్త్ర విక్రయ దారుల సంఘం ఆధ్వర్యంలో చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈనెల 22న చలో మంగళగిరి చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22న మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గాలి గోపరి నుండి నూతన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, నేతన్న సర్కిల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల వాల్పోస్టర్లను వారు అతికించారు. మొత్తం 16 సంఘముల నాయకులు ఈ సభలో పాల్గొంటున్నారని, ధర్మవరం నియోజకవర్గము నుండి వందల సంఖ్యలో చేనేత కార్మికులు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు