ఐదు అవార్డులతో మెరిసిన అడాల్‌సెన్స్
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక (Emmy Awards 2025) లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరై ఈ వేడుకను మరింత స్పెషల్ గా మార్చారు. ఈసారి నామినేషన్ల బరిలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు పోటీ పడ్డాయి.అందులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన అడాల్‌సెన్స్ (Adolescence) ఘన విజయం సాధించి ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో నటించిన ఓవెన్ కూపర్, చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు గెలుచుకుని కొత్త రికార్డు సృష్టించాడు.
ప్రధాన విభాగాల విజేతలు
ఉత్తమ డ్రామా సిరీస్ : ది పిట్(The Pitt)
ఉత్తమ నటుడు : నోహ్ వైల్ (ది పిట్‌లి)
ఉత్తమ నటి : బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
ఉత్తమ కామెడీ సిరీస్ : ది స్టూడియో
ఉత్తమ సిరీస్ : అడాల్‌సెన్స్ (Adolescence)
సిరీస్ విభాగం అవార్డులు
ఉత్తమ నటుడు (సిరీస్) : స్టీఫెన్ గ్రాహం (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయ నటి (సిరీస్) : ఎరిన్ డోహెర్టీ (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయ నటుడు (సిరీస్) : ఓవెన్ కూపర్ (అడాల్‌సెన్స్)
స్క్రిప్ట్ & దర్శకత్వ విభాగం
ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ : లాస్ట్ వీక్ టునైట్.. (సాటర్డే నైట్ లైవ్)
ఉత్తమ దర్శకుడు : ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్)
ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ సిరీస్) : ఫిలిప్ బారంటిని (అడాల్‌సెన్స్)
కామెడీ విభాగం
ఉత్తమ సహాయ నటుడు (కామెడీ) : జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్)
ఉత్తమ సహాయ నటి (కామెడీ) : హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్)
ఉత్తమ రియాలిటీ షో : ది ట్రెయిటర్స్


