– యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం
విశాలాంధ్ర ధర్మవరం: పేద ప్రజల కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయమని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా శీలం సావిత్రమ్మ, శీలం శ్రీరాములు ,వీరి కుమారుడు శీలం జయప్రకాష్ ,కోడలు శీలం రమ్య నాగిని వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాతలను ఘనంగా సన్మానించారు. ఈ శిబిరంలో 79 మంది కంటి రోగులు రాగా అందులో 41 మంది ఆపరేషన్కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్, సహకార దర్శి రమేష్ బాబు, వై కే శ్రీనివాసులు, చాంద్ బాషా, రామాంజనేయులు, రామచంద్ర గుప్తా, ఓవి ప్రసాద్, కృష్ణమూర్తి, రిటైర్డ్ ఆర్మీ శ్రీధర్ దదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే ధ్యేయం
- Advertisement -
RELATED ARTICLES


