Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు నాయకులు, మండల కన్వీనర్ జేవి. రమణ, కో కన్వీనర్ అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ డ ఎంప్లాయిస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్మవరంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ధర్మవరం సిఐటియు ఆఫీస్ నుంచి కళాజ్యోతి కాలేజ్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగినది .
ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ ,కో కన్వీనర్ టి అయుబ్ ఖాన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్మికులకు రెగ్యులర్ చేస్తామని., సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేస్తామని హామీ లు ఇవ్వడం జరిగింది అన్నారు.కానీ అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత కార్మికులను నట్టేట ముంచే విధంగా ఆప్కాస్ పద్ధతిని రద్దుచేసి, కాంట్రాక్ట్ పద్ధతిని మరల అమలు చేయాలని ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం రూపొందిస్తున్నదని , గతంలో వైయస్సార్ ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి అప్కాస్ విధానాన్ని అమలు చేసి కార్మికులకు వేతనాలు పెంచి కార్మికులను రెగ్యులర్ చేయకపోయినా, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి నెల వేతనాలు వచ్చే విధంగా ఆప్కాస్ పద్ధతిని తీసుకొని వచ్చి కార్మికులను ఆదుకున్నరని తెలిపారు.
కానీ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేయాలని ఆలోచిస్తున్నారని, ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని, గతంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినందుకు అధికారాన్ని కోల్పోయి, తిరిగి అధికారంలోకి రావడానికి కార్మికులకు అనేక రకమైన మోసపూరితమైన హామీలు ఇచ్చి ,ఆ హామీలను అమలు చేయకుండా కార్మికులను మరింత ఇబ్బందులు గురి చేసె పద్ధతులు అమలు చేయాలనుకోవడం కార్మికులకు మోసం చేయడమేనని వారు మండిపడ్డారు.
ఈరోజు స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర అని, పాలకులు చెపుతున్నారంటే అది కేవలం మున్సిపల్ కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య, పరిశుభ్రత కారణంగానే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర అనిచెప్పుకోవడానికి గాని. చంకలు గుద్దుకోవడానికి గాని అవకాశం ఉంటుందని తెలిపారు.అటువంటిది కార్మికులకు నష్టం కలిగించే విధానాలు తీసుకొని వస్తే రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులను కలుపుకొని అనేక రకమైన పోరాటాలు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ఇప్పటికైనా కార్మికులకు నష్టం కలిగించే పద్ధతులు మానుకోవాలని,చేతనైతే మంచి చేయాలే తప్ప కార్మికులకు నష్టం కలిగించరాదని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ హైదర్ వలీ సిఐటియు నాయకులు, మున్సిపల్ పారిశుద్ధ కార్మిక పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, కమిటీ సభ్యులు, కార్మికులు ,ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు బొగ్గు నాగరాజు ,పట్టణ కమిటీ అనిల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు