రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయ సింహ, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి పెద్దారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,క్యాంపు చైర్మన్ కలవల మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాంస్కృతిక మండేలలో జులై 12వ తేదీ నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా కోటా మున్సిపల్ పాఠశాల యందు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నెల రెండవ ఆదివారం ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం ఉంటుందని వారు గుర్తు చేశారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్లు, ఉచిత వసతి, ఉచిత రవాణా, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులలో ఏవైనా రెండు జిరాక్స్ కాపీలు, చిరునామాతో కూడిన సెల్ నెంబర్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. బిపి షుగర్ అధికంగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని రావాలని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్ కుమారుడు కలవల నాగ తేజ కోడలు కలవల శర్వాణి మనవళ్లు మీహాన్,దిశాన్ (సుకన్య సిల్క్స్ ధర్మవరం) కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కావున ఇటువంటి అవకాశమును పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ నరేందర్ రెడ్డి సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాల వెంకటేశులు, పెద్దారెడ్డి, శ్రీనివాసులు, నాగభూషణం, కొండయ్య, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..
- Advertisement -
RELATED ARTICLES


