Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపట్టణ బీసీ సంక్షేమ సంఘం డైరెక్టర్ ఏకగ్రీవం

పట్టణ బీసీ సంక్షేమ సంఘం డైరెక్టర్ ఏకగ్రీవం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శిరిడి సాయిబాబా ఆలయ సమీపంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం పట్టణ డైరెక్టర్ గా సత్యమును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పట్టణ అధ్యక్షుడు బండి వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యక్షుడిగా గోకుల రవి, కార్యదర్శిగా జంగ మన్న,సహాయ కార్యదర్శిగా బెల్లం తిరుపాల్, కోశాధికారిగా బీటీ. కొండయ్య డైరెక్టర్లుగా మల్లన్న, పోతులయ్య ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. తదుపరి నాయకులు షీలా నారాయణస్వామి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు