Friday, December 13, 2024
Homeజిల్లాలుఅనంతపురంతలగాసిపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

తలగాసిపల్లి సమీపంలోని రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర -అనంతపురం : గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ Iూూ గారు పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి ఎస్పీ చేరుకొని అక్కడ ఘటన జరిగిన తీరును మరియు అందుకు కారణాలను నిశితంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రూరల్ డి.ఎస్.పి టి.వెంకటేశులు మరియు ఇతర పోలీసు అధికారులు వెళ్లారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు