షిరిడి సాయి బాబా సేవ సమితి అధ్యక్షులు వీరనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; గుంటూరులో జరుగుతున్న సీనియర్ హాకీ టోర్నమెంట్లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు ప్రథమ స్థానం రావాలని షిరిడి సాయి బాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా సీనియర్ హాకీ ఎంపికలో పాల్గొంటున్న హాకీ క్రీడాకారులను వీరనారాయణ గౌరవ మర్యాద పుచ్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ హాకీ క్రీడలు ధర్మవరంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చిందని తెలిపారు. గత సంవత్సరం ధర్మవరంలో జరిగిన సీనియర్ టోర్నమెంట్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానం రావడం సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
హాకీ టోర్నమెంట్లో జిల్లా జట్టు ప్రథమ స్థానం రావాలి..
RELATED ARTICLES