Sunday, March 30, 2025
Homeజిల్లాలునెల్లూరుతప్పైపోయింది క్షమించండి

తప్పైపోయింది క్షమించండి

మృతుని తల్లిదండ్రులను వేడుకున్న కారు డ్రైవర్ ఆయన సతీమణి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండలంలోని బడేవారిపాలెం – పోకూరు మధ్యలో ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో ఈనెల 18వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారకులైన కారు డ్రైవర్ ఆయన సతీమణి గురువారం మృతుని స్వగ్రామమైన వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామానికి చేరుకుని మృతుని తల్లిదండ్రులు బాసం వెంకటేశ్వర్లు ఆయన సతీమణి మాధవిని కలిసి తప్పయిపోయింది తమను క్షమించాలని వేడుకున్నారు. చేతికంది వచ్చిన మీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తమకు బాధాకరంగా ఉందని వాపోయారు. తమను క్షమించాలని మృతుని తల్లిదండ్రులను వేడుకొని బ్రతిమలాడుకున్నారు. తాము ప్రకాశం జిల్లా సిఎస్ పురం నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అప్పటినుంచి మిమ్మల్ని కలిసి క్షమించాలని వేడుకోవాలని అనుకుంటున్నప్పటికీ కొద్దిగా ఆలస్యమైందని వారు వెంకటేశ్వర్లు మాధవి ల దృష్టికి తెచ్చారు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులు అంత బాధలోనూ కారు డ్రైవర్ ఆయన సతీమణి ని క్షమించడం వారి పెద్ద మనసుని చాటుకుంది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన కారును గుడ్లూరు పోలీస్ స్టేషన్లో స్వాధీనపరిచారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు