మండల విద్యాశాఖాది కారులు, యు ఎస్ ఎన్ మూర్తి, ఇ విజయ్ కుమార్
విశాలాంధ్ర – నెల్లిమర్ల : విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే జ్ఞానజ్యోతి శిక్షణ ముఖ్య ఉద్దేశం అని మండల విద్యాశాఖాదికారులు, యు ఎస్ ఎన్ మూర్తి, ఇ విజయ్ కుమార్ అన్నారు. అంగన్వాడీలకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరజాపు పేటలో మూడో రోజూ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అంగన్వాడీ దశ నుంచి అన్ని సంస్థలను ఒకే చోట ఉంచాలన్న సంకల్పంతో ఫౌండేషన్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు ఒకే చోట నిర్వహించేలా చూస్తుందన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై దష్టి సారించాలన్నారు. సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లల ఎదుగుదలపై చర్యలు చేపట్టాలన్నారు. చిన్నారుల ఎదుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు మరియు పౌష్టికాహారం వినియోగం, వారిలో గుర్తించవలసిన అంశాలను గురించి వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పర్యవేక్షణగా ఏసి డిపిఓ పి తవిటి నాయుడు వ్యవహరించారు.