Tuesday, April 1, 2025
Homeజిల్లాలునెల్లూరుప్రతి తెలుగువాడి గుండెచప్పుడు తెలుగుదేశంపార్టీ..చెరువుపల్లి మాల్యాద్రి

ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు తెలుగుదేశంపార్టీ..చెరువుపల్లి మాల్యాద్రి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : తెలుగువారి కీర్తి ఖ్యాతి గుండెచప్పుడు తెలుగుదేశంపార్టీ అని మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రి అన్నారు. శనివారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూతెలుగువాడి గొప్పతనం దేశవ్యాప్తంగా చాటేందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ని స్థాపించారని అన్నారు. దేశవ్యాప్తంగా తెలుగుదేశం జెండా పండుగను ఒక పండుగ లాగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారని అన్నారు.తెలుగుదేశంపార్టీ ఆవిర్బావ దినోత్సవం తెలుగువారిలో ఆత్మ విశ్వాసం, మనోదైర్యం నింపడానికి తెలుగు చలనచిత్ర రారాజు, కారణజన్ముడు, మహోన్నతుడు, తెలుగోడు గుండెచప్పుడు, ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ అని అన్నారు.ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెరువుపల్లి సాంబయ్య, ముతకని వెంకట్రావు,మీనుగ మాల్యాద్రి, జల్లి మధు, చుండి మాల్యాద్రి,చుండి బ్రహ్మయ్య,గువ్వల వీరేంద్ర,చెరువుపల్లి హనుమంతురావు, ఇరుపని క్రిష్టయ్య, తిరుమలశెట్టి నరసింహారావు,చొప్పర సాంబయ్య, చొప్పర బ్రహ్మయ్య,చెరువుపల్లి అశోక్,ఇరుపని మాల్యాద్రి, ఇరుపని కళ్యాణి,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు