Friday, April 11, 2025
Homeజిల్లాలుకర్నూలుపెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలంటూ మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం చెందాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని విమర్శించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 830 నుంచి 880 రూపాయలకు చేయడంతో రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. గ్యాస్ ధర పెంచడం వల్ల ఏడాదికి 525 కోట్లకు పైగా బారం పడుతుందన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజలపై మోపిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, రామాఒ, గూడు ఖాజా, నాగన్న, మూకన్న, శీను, ఎర్రన్న, అల్లా బకాష్, వీరేష్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు