-సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వందలాదిగా ర్యాలీ, నిరసన
-పట్టాల పంపిణీ అంతా అక్రమాలే
-పూర్తిస్థాయిలో విచారించాం, ఉన్నతాధికారుల నివేదిక అందిన తర్వాత చర్యలు చేపడతాం…తహసీల్దార్ నటరాజ్
విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని 650-2 సర్వే నెంబర్లు అవినీతి అక్రమాలపై కదిలిన బాధిత నూతన ప్లంబర్ అసోసియేషన్ నాయకులు, సిపిఐ ఏఐటియు ఆధ్వర్యంలో వందలాదిగా ర్యాలీ నిరసన చేయడం జరిగింది. పట్టాల పంపిణీ అంతా అక్రమాలుగా బట్టబయలు కావడంతో, తాసిల్దార్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామని, ఉన్నతాధికారుల ద్వారా ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు చేపడతామని తాసిల్దార్ నటరాజు చెప్పడం జరిగిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సర్వే నెంబర్ లో ఏకంగా యూనియన్ మాటున ముగ్గురు వ్యక్తులు కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు పొందడం జరిగిందని, పట్టాలు పొందడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని తెలిపారు.
ధర్మవరం పట్టణంలో పేదలకు ఇచ్చే పట్టాల పంపిణీలో ఎక్కడచూసిన అవినీతి అక్రమాలే కొట్టొస్తున్నట్టు కనిపిస్తున్నాయి అని తెలిపారు. పేదలకు అందాల్సిన పట్టాలన్నీ కొందరికే పరిమితం కావడంతో బాధితులంతా ప్రజాసంఘాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా 650-2 సర్వేనెంబర్ లో అర్హులకు పట్టాలు దక్కక పోవడంతో ,బాధితులంతా ఏకమై సిపిఐ వాటి అనుబంధ శాఖ ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన చేపట్టారు. ఈ నిరసన గాంధీ నగర్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్, కళాజ్యోతి, కాలేజ్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, సిరికల్చర్ కార్యాలయం మీదుగా 650-2 సర్వేనెంబర్ స్థలాల వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జింక చలపతి, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూ నాయకులు ఎర్రంశెట్టి రమణ ఆధ్వర్యంలో ఈ ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం 1 గంట సమయం వరకు వేలాది మందితో ఈ నిరసన జరిగింది. ఎక్కడైతే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో ఆ ప్రాంతానికి ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ నటరాజ్ అక్కడికి చేరుకొని, ఆందోళన కారులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చడమే కాకుండా అసలైన ప్లంబర్స్ కు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని సిపిఐ తోపాటు బాధితులు భీష్ముంచారు. దీంతో స్పందించిన తాసిల్దార్ 650-2 సర్వేనెంబర్ ఒకటో నెంబర్ లో 2024 ఫిబ్రవరి నెలలో పట్టాలు ఇచ్చారన్నారు. అయితే ఇందులో ఈ పట్టాలన్నీ అక్రమంగా తీసుకున్నవే అని ప్రాథమికంగా తేల్చామన్నారు. రెవెన్యూ, నిబంధనల ప్రకారం నడుచుకోకపోవడమే కాకుండా ఒకటి, రెండు కుటుంబం సభ్యులకే పట్టాలన్ని చేసుకున్నారని మా విచారణలో తేలింది అని వారు స్పష్టం చేయడం జరిగింది. పట్టణ పరిధిలో ఒక సెంటు మాత్రమే ఇవ్వాలని నిబంధన ఉందని, వాటిని కూడా తుంగలో తొక్కి ఎవరికి అనుగుణంగా వారు ఒకటిన్నర నుంచి మూడు సెంట్లు వరకు ఒక పట్టా పొందారు అని తెలిపారు. ఖాళీ స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకోవడం కూడా చట్ట విరుద్ధమని తాసిల్దార్ తేల్చేశారు. ఇందులో 76 మందికి పట్టాలు ఇవ్వగా 15 శాతము మంది ఇందులో అర్హులుగా ఉన్నారని, మిగిలిన వారందరూ అనఅర్హులే అన్నారు. వీటిపై నివేదిక తయారుచేసి కలెక్టర్ కు నివేదిస్తామన్నారు. ఈ నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు. అనంతరం సిపిఐ నాయకులు, జింక చలపతి మాట్లాడుతూ…. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో విచారించి నిజమైన ప్లంబర్స్ కు న్యాయం జరిగేలా చూడాలని వారు అధికారు లను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు రమణ, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,సకల రాజా, చెన్నంపల్లి శ్రీనివాసులు, హరి, శ్రీధర్, నాగేంద్ర, ప్లంబర్స్ అసోసియేషన్ నాయకులు గోవిందరాజులు, అన్నం లక్ష్మీనారాయణ, తాజ్, ఆంజనేయులు, మహిళా సమాఖ్య నాయకురాలు లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.