Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలందరికీ ఉచితంగా కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ ముఖ్య లక్ష్యము..

ప్రజలందరికీ ఉచితంగా కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ ముఖ్య లక్ష్యము..

రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహా, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన గుప్త
విశాలాంధ్ర -ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్యమైన లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) రోటరీ క్లబ్ వారు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ,కార్యదర్శులుతో పాటు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో రోటరీ క్లబ్ పేద ప్రజలకు సేవ చేయడమే మా సేవగా భావిస్తామని తెలిపారు. శిబిరానికి వచ్చిన వారందరికీ కూడా బీపీ షుగర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కొత్తపల్లి ఉలక్కిరెడ్డి జ్ఞాపకార్థం భార్య కొత్తపల్లి సరస్వతమ్మ, హెచ్ కోదండరాం, లలితమ్మ, కీర్తిశేషులు బి. లక్ష్మీ దేవమ్మ, కృష్ణమూర్తి రావు ల జాపకార్థం వారి కుమారులు వ్యవహరించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతతో పాటు వీరిని ఘనంగా సత్కరించడం జరిగింది అని తెలిపారు.ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ-శ్రీ సత్య సాయి జిల్లా వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. మొత్తం 79 మంది కంటి రోగులు పాల్గొనగా, వీరందరికీ శంకర కంటి ఆసుపత్రి డాక్టర్ ఆర్. బర్షా కంటి వైద్య చికిత్సలను చేయించి, కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు రోగులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. వైద్య చికిత్సల అనంతరం 56 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరందరికీ ఉచిత వైద్య చికిత్సలతో పాటు ఉచిత ఆపరేషన్లు, ఉచిత రవాణా ఖర్చు, ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోహర్ గుప్తా, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, శంకర కంటి ఆసుపత్రి ఆర్గనైజర్ నీల శివకుమార్, సత్రశాల ప్రసన్నకుమార్, టీచర్ రామకృష్ణ, శివయ్య ,శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి, బండారు వెంకటచలం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు