ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యము అని ఎన్ డి ఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ,జిల్లా ఎంప్లాయిమెంట్ శిడాప్ సంయుక్త చైర్మన్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగానే ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ జాబ్ మేళా కి మూడు కంపెనీ ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాలోకు సుమారు 41 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 18 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు, నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి తేజ కుమార్, సిడాపు డిపిటిఎమ్ నారాయణ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సిడాపు సిబ్బంది, ఎంప్లాయ్మెంట్ అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యం..
RELATED ARTICLES