Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది..

ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది..

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ కు 42, 951 రూపాయలు బ్రాహ్మణ వీధికి చెందిన మాదినేని వెంకట నాయుడుకు 36వేల 666 రూపాయలు, శివానగర్కు చెందిన సాయి ప్రతాప్ నాయుడుకి 32,500 రూపాయలు తిక్క స్వామి నగర్కు చెందిన ఉక్కిసల సింధుకు 1,30, 785 రూపాయలు, బత్తలపల్లి మండలానికి చెందిన షేక్ షాకీర్ బి కి 45000 వెరసి మొత్తం ఐదు మందికి రెండు లక్షల 87 వేల 902 రూపాయలు సీఎం ఆర్ఎఫ్ పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బాధితులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే సత్తి కుమార్ యాదవ్కు, పరిటాల శ్రీరామ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు