Wednesday, November 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినియోజక అభివృద్ధి పనులకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది..

నియోజక అభివృద్ధి పనులకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది..

ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర- ధర్మవరం:: నియోజకవర్గ అభివృద్ధితోపాటు ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుతుందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలలో వారు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా తొలుత నియోజకవర్గంలోని బత్తలపల్లి లో కేజీబీవీ పాఠశాల భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య వైద్యకు ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదని, అభివృద్ధి బాటలో నడిపేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. తదుపరి మంత్రి పట్టణంలోని ప్రధాన కాలువల పూడిక తీసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పూడిక తీసే కార్యక్రమాన్ని స్వయంగా వారు వీరితోపాటు చిలకం మధుసూదన్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని పూడికతీత ను తీయడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ మంచినీరు సరఫరా ప్రాజెక్టుల గురించి వివరిస్తూ 62 కోట్ల 68 లక్షల రూపాయల నిధులతో అమృత్ పేస్ట్ కింద పనులను చేపడుతున్నట్లు ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రమైన ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనులు చేపడుతోందని ఎందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.అనంతరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులకు సమీక్ష సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులను, పెండింగ్ పడిన పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై విభాగాల వారీగా అధికారులతో నేరుగా సమీక్షణ జరిపారు. ఈ సమీక్షలో ప్రతి విభాగానికి చెందిన అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దరిన చేర్చేలా కృషి చేయాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. ప్రజల వద్ద ఎటువంటి ఫిర్యాదుల అందిన సహించేది లేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పని చేసేందుకే ఉన్నారని, లంజాలకు అలవాటులోకి పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాల వివిధ విభాగాల అధికారులు ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన మంత్రి వాటిని ప్రభుత్వ దిష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి చెలిమి జీర్నోదరణ కార్యక్రమానికి వారి విచ్చేసి కార్తీక దీపోత్సవాన్ని వారు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కార్తీకమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైనదని ప్రాముఖ్యత చాటుకుంటుందని తెలిపారు. దైవ ఆశీస్సులు లేనిదే ఏ పనిని కూడా మనిషి చేయలేడని తెలిపారు. అనంతరం త్రిలింగేశ్వర స్వామి ఆలయమును దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలోనూ మంత్రితోపాటు చిలక మధుసూదన్ రెడ్డికి కూడా ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం తన పర్యటనలో ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకొని త్వరలో పరిష్కరించే దిశలో చర్యలు చేపడతామని అక్కడి ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు