Monday, February 24, 2025
Homeజిల్లాలుకర్నూలునిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి అన్నారు. సోమవారం మాధవరం గ్రామంలోని టీడీపీ కార్యాలయం నందు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి టీడీపీ యాప్ ను వినియోగించి ప్రజలకు మరియు టీడీపీకి వారధిగా పనిచేసిన 18 మంది టీడీపీ సోషల్ మీడియా టీంకు మంగళగిరి నుంచి వచ్చిన టీడీపీ జెండాలను, ప్రశంసా పత్రాలను సోషల్ మీడియా టీం హనుమంతరెడ్డి, మీసేవ ఆంజనేయ, తలారి అంజి, జాలవాడి యంకన్న, శ్రీనివాసులుకు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విషం నింపుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దీన్ని తిప్పుకొట్టేందు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు